Dailyhunt
వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్ వస్తే క్లిక్ చేయకండి: సీపీ సజ్జనార్

వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్ వస్తే క్లిక్ చేయకండి: సీపీ సజ్జనార్

వార్త 1 week ago

Hyderabad: సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త వేషాలతో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఏది ట్రెండ్‌లో ఉంటే దాన్ని ఆయుధంగా చేసుకుని బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ నగరవాసులను లక్ష్యంగా చేసుకుని ‘వాటర్ బిల్లు బకాయిల’ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ దాడులపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు.

Read Also: Singer Mangli: నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు

Hyderabad: సీపీ సజ్జనార్ హెచ్చరికలు

హైదరాబాద్‌ నగరంలో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. “మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే డబ్బులు చెల్లించకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ఆపై HMWSSB WATER BILL UPDATE. apk పేరుతో ఒక ప్రమాదకరమైన లింక్‌ ను పంపి, దాన్ని ఇన్‌ స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్‌ ను మీ ఫోన్‌ లో డౌన్‌ లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.

 Hyderabad Water Bill Cyber Fraud

మీ కాల్స్‌ ను డైవర్ట్ చేయడమే కాకుండా, మీ స్క్రీన్‌ను నిరంతరం గమనిస్తూ బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌ కు కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in పోర్టల్‌ లో ఫిర్యాదు నమోదు చేయండి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు!! అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సింగూర్ ప్రాజెక్టుకు దిగువకు నీటి విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha