Electric workers : ఎగిరెగిరి దంచినోడికి అదే కూలి.. ఎగరకుండా దంచినోడికి అదే కూలి' అన్నట్లు ఏసీలో కూర్చునోళ్లకు అదే కూలి, ఎండనక వాననకా, రాత్రనక, పగలనక కరెంటు కోసం చెట్లు పుట్టలు ఎక్కెటోళ్లకు అదే కూలి కాదు అంతకన్నా తక్కువ కూలీ, అదేంది అనుకుంటున్నారా ఇది నిజం.
కింద కూసోని పని చెప్పే టోళ్లకు పైసలెక్కువ అదే కరెంటు స్తంభాలెక్కి పనిచేసే కార్మికులకు తక్కువ జీతం, ఎక్కువ శ్రమ, గ్యారెంటీ లేని జీవితం ఎప్పుడు ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి. ఇన్ని ఇబ్బం దులను తట్టుకొని కూడా
శ్రమిస్తున్నారంటే నిజానికి కరెంటు కార్మికులకు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పది నిమిషాలు కరెంటు పోతే మనం అల్లాడిపోతం, అంతేకాదు మనం 12 గంటలు డ్యూటీ చేస్తేనే అయోమ యం అయిపోతాం మరి అలాంటిది కరెంటు కార్మికుల పరిస్థితి ఎప్పుడైనా చూశారా? మనం దేశంలో ఎక్కువ కష్టపడేది ఎవరంటే మొదటగా సైనికులు, ఆతర్వాత పోలీ సులు, కరెంటు కార్మికులు కూడా అత్యధికంగా శ్రమించే వారే ఇందులో ఎలాంటి సందేహంలేదు. ఎండైనా, వానైనా, రాత్రైనా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలెక్కి పని చేయడం చిన్న విషయం కాదు. ఒక్క చిన్న తప్పిదం జరిగినా ప్రాణానికి ముప్పు. అయినా కూడా వాళ్లు పనిచే స్తూనే ఉంటారు. ఎందుకంటే సమాజం నడవడానికి వాళ్ళు పని చేయడం ఎంతో అవసరం లేదంటే అంతా చీకటిమ యం. మరి అంత శ్రమించేవారికి జీతం ఎందుకు తక్కువ అనుకుంటున్నారా అదే మరి ఇక్కడ సమస్య మనం అర్థం చేసుకోవాల్సింది.
Read Also : Noida Phase 2 Protest: వేతనాల పెంపు కోసం కార్మికుల విధ్వంసం.. వాహనాల దహనం, రాళ్లదాడి!
Electric workers
Electric workers : తలరాత మారడం లేదు.
‘ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొ దట విసిరేసేది అప్పటివరకు సహాయపడిన చేతికర్రనే’ అన్నట్లు ఓడిపోయిన నాయకులకు, గెలిచిన నాయకులకు కరెంటు కార్మికులు చేతికర్రలాంటోళ్ళు. వాళ్ళకి పదవిరాగానే కరెంటు కార్మికుల కంటికి కనపడకుండా తిరుగుతారు. అప్ప టిదాకా మేము ఉన్నాం మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అన్నోళ్లే ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితి. ఈ కార్మికుల కష్టా లు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కకావికలం అవుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పేర్మినెంట్ చేస్తాం అనగానే కార్మికు లకు ఇక మాకు మంచిరోజులు వచ్చినాయి అనుకుండ్రు. తీరా చూస్తే మళ్ళి మొదటికి వచ్చింది. మళ్ళా ఎలక్షన్స్ దాకా ఇదే నస. ఇక కరెంటు కార్మికుల జీవితాలు మరేందెన్నడు అనే ప్రశ్నకు జవాబు లేదు. ‘ఏరు దాటేదాకా ఓడమల్లయ్య.. ఏరు దాటాక బోడి ‘మల్లయ్య’ అన్నట్లు ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి తలరాత మాత్రం మారడం లేదు. పోనీ డ్యూటీ అయినా తగ్గిస్తారేమో అనుకుంటే 24 గంటల డ్యూటీ. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే కరెంటు పని చేస్తున్నాం అంటే పిల్లను ఇస్తలేరంట. ఎందుకంటే భద్రత లేని బతుకు కదా! అయ్యో కష్టాలు కన్నీళ్లు ఏరులై పారు తున్న కనికరించే నాయకుడు లేడు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు
తెలంగాణ రాష్ట్ర విద్యు త్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాడని ఏండ్లతరబడి మొత్తుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఇగ చేస్తాం అగ చేస్తాం అని చెప్పు డే తప్ప చేసింది ఏమిలేదు. గత 18ఏళ్లకు పైగా తెలంగాణ విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా సేవలందిస్తున్న వారు అప్పటి తెలంగాణ ఉద్యమ సమయంలో, వీరి సేవ లను క్రమబద్ధీకరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో, 2016లో విద్యుత్ కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. నిరసన కారణంగా జూలై 28, 2017న పారిశ్రామిక వివా దాల చట్టం, 1947లోని సెక్షన్ 12(3) ప్రకారం ఒప్పందం కుదిరింది. జూలై 29, 2017న సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు చూస్తే సమస్య పరి ష్కారం దిశగా వెళ్లినట్టే కనిపించింది. అయితే, ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ కొందరు నిరుద్యోగ యువకులు దీనిని హైకోర్టులో సవాలు చేసి నీరుగార్చేలా చేశారు. సెప్టెంబర్ 2018న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పునిస్తూ, సెక్షన్ 12(3) ప్రకారం ఈ సమస్యలను పరి ష్కరించుకునే అధికారం విద్యుత్ సంస్థలకు, రాష్ట్ర ప్రభు త్వానికి, కార్మిక సంఘలకు ఉందని స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా 23,667 మంది కార్మికులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటిం చారు. కానీ కార్మికుల రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతూ కార్మికులకు పూర్తిస్థాయి క్రమబద్ధీకర ణకు బదులుగా, పాత ఉత్తర్వులను రద్దు చేసి, ఫ్యాక్టరీల చట్టం 1946 స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ రూల్స్ ను ప్రవేశ పెట్టింది. దీనివల్ల అధికారికంగా శాశ్వత హోదా లేకుండానే కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు.
సమాన అవకాశాలు లేకపోవడమే
చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు’ అన్నట్లు వీరు సమాజం దృషలో శాశ్వత ఉద్యోగులే కానీ, ప్రభుత్వ దృష్టిలో మాత్రం కాదు. చెప్పుకోవడానికి కరెంటు ఉద్యోగం కానీ వీరి జీవితం కన్నీ ళ్లు కష్టాలే. జీతం పెంచుడు దేవుడెరుగు కానీ వారికష్టాలను చూసైనా కనికరించండయ్యా మహా ప్రభో అని వేడుకున్నా వినే నాయకుడు లేడు. ఇక పని విషయానికి వస్తే ఎంత చెప్పుకున్నా వీరి కష్టాలు తక్కువగానే అనిపిస్తాయి. ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకరి పని నలుగురు చేస్తుంటే, కరెంట్ ఆఫీసుల్లో మాత్రం ఐదుగురు చేయాల్సిన పనిని ఇద్దరు ముగ్గురే మోస్తున్నారు. సమాన అవకాశాలు లేకపోవడమే కాదు గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ అయినవాళ్లకి, రెగ్యులర్ కాని వాళ్లకి 30 నుంచి 60శాతం వరకు జీతాల్లో తేడా ఉంది. సాధారణంగా ఏడాదికి 300 షిఫ్టులు ఉండా లి. కానీ వీరు 450 షిఫ్టులు చేస్తున్నారు. వారానికి సెల వులు కూడా లేకుండా, నిరంతరం పని ఒత్తిడిలోనే బ్రతుకుతున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉందంటే తమ కుటుంబ సభ్యుల చివరి చూపుకి కూడా వెళ్లలేని పరిస్థితి. అంత్యక్రియలకు హాజరు కాలేని బాధ మాటల్లో చెప్పలేం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే. ఆర్టిసన్ కార్మికులకి ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ లేవు. గ్రాట్యుటీ అనే హక్కు కూడా లేదు. దాంతో రిటైర్ అయ్యాక కూడా బ్రతుకుదెరువు కోసం మళ్లీ వృద్ధాప్యంలో అడ్డా కూలీలుగా తిరగాల్సిన పరిస్థితి. నిబంధనల ప్రకారం గ్రేడ్ మార్చితే ప్రభుత్వానికి నెలకు 10 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్తున్నారు. కానీ వారేమీ అదనంగా అడగడం లేదు సార్. ఇప్పుడు తీసుకుంటున్న జీతాలకే (కరెంట్ పే స్కేల్కి) వారిరెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకోండి అనేదే వారి విజ్ఞప్తి.
Electric workers
కనీస భరోసా కూడా లేకపోవడం
ప్రభుత్వంపై భారం లేకుండా, వారి బ్రతుకుల్ని గాడిలో పెట్టాలనే వారి కోరిక మాత్రమే అంతే అని అంతలా వేడుకున్నా కూడా ప్రభుత్వం కరుణించకపోవడం ఇది మాత్రం కరెంట్ కార్మికుల దౌర్భాగ్యమే అనాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే విధి నిర్వహణలోనే ఎంతో మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అంగవైకల్యం చెందుతున్నారు. అటు కార్మికులకి ఎలాంటి సర్వీస్ బెని ఫిట్స్ లేవు. ఇటు బతుకుకు ఎలాంటి గ్యారెంటీ లేదు. ఇలా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నారు. పాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నా కనీస భరోసా కూడా లేకపోవడం నిజంగా బాధాకరం. ఇన్ని కష్టాలు భరిస్తూ కూడా ప్రభుత్వాన్ని కార్మికులు కోరుకునేది ఏంటో తెలుసా!ఆర్టిసన్ కార్మికుల్లో బి.టి డిప్లొమా, పిజిలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయినా సరే వారికి సరైన కేడర్ లేకుం డా, గౌరవం లేకుండా పని చేస్తున్నారు. వారిని కూడా గౌరవించి, సమాలోచన చేసి, తగిన చర్యలు తీసుకోవాలి. కనీసం వారికి ప్రభుత్వం పాత సర్వీస్ రూల్స్ అమలు చేసి, జీవితాల్లో వెలుగులు నింపండని ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.
–కోట దామోదర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
సమ్మర్ స్పెషల్ రైళ్ల జాబితా విడుదల.. టికెట్ల బుకింగ్ ప్రారంభం

