Noida Phase 2 Protest: నోయిడా ఫేజ్-2లో జీతాల పెంపు డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన ఆందోళన మూడో రోజున అదుపుతప్పింది. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని, యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చారు.
శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన ఒక్కసారిగా హింసాత్మక ఘర్షణకు దారితీయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కంపెనీ గేటు వద్ద చర్చలు విఫలం కావడమే ఈ విధ్వంసానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Read Also :Women's Reservation Bill: డీలిమిటేషన్ విధానం తప్పు: కేంద్రంపై సోనియా గాంధీ ఫైర్!
వాహనాల ధ్వంసం.. పోలీసులపై రాళ్ల వర్షం
Noida Workers Violent Protest
ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు కంపెనీ ప్రాంగణంలోని ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. పార్కింగ్‌లో ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. కంపెనీ కిటికీలు, అద్దాలను పగులగొట్టి భారీగా నష్టం చేకూర్చారు. లోపల ఉన్న సిబ్బంది ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
Noida Phase 2 Protest: భారీగా మోహరించిన బలగాలు
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. వందలాది మంది పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను నోయిడా ఫేజ్-2కు పంపారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ పారిశ్రామిక ప్రాంతం మొత్తం పోలీసుల పహారాలో ఉంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి సెక్షన్ 144 తరహా ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

