Dailyhunt
బయోగ్యాస్ వైపు అడుగులు వేయాలి!

బయోగ్యాస్ వైపు అడుగులు వేయాలి!

వార్త 3 days ago

Biogas : ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఈ యుద్ధ వాతావరణం కారణంగా చమురు ధరలు పెర గడం, సరఫరా గొలుసులు దెబ్బతినడం వంటి పరిణా మాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగంలో విస్తృతంగా ఉపయోగించే ఎల్పిజి సరఫరా లో కొరత ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించడం అత్యవసరం. అందులో ముఖ్యంగా బయోగ్యాస్ ఒక సుస్థిరమైన, చౌకైన పర్యావరణానికి మేలు చేసే పరిష్కారంగా నిలుస్తుంది. గ్రామీణ భారత దేశంలో ఇప్పటికే కొంతమేరకు వినియోగంలో ఉన్న బయోగ్యాస్, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. బయోగ్యాస్ అనేది పశువుల ఎరువు, వంటింటి వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాలువంటి సేంద్రీయ పదార్థాలను క్షయం చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువు.

Read Also: Solar Plant Investment: ఏపీలో టాటా పవర్ భారీ పెట్టుబడి

 Biogas

ఇది ప్రధానంగా మీథేన్ వాయువుతో కూడి ఉంటుంది. దీన్ని వంట ఇంధనంగా ఉపయోగించ వచ్చు. ఎల్పిజి స్థానంలో బయోగ్యాస్ వినియోగం పెరి గితే, దిగుమతులపై ఆధారపడే అవసరం గణనీయంగా తగ్గుతుంది. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో పశుసంపద విస్తృతంగా ఉంది. ప్రతి గ్రామం లోనూ పశువుల ఎరువు సమృద్ధిగా లభిస్తుంది. ఈ వన రులను సమర్థవంతంగా వినియోగిస్తే, ప్రతి ఇంటికీస్వయం సమృద్ధి గల ఇంధన వనరుగా బయోగ్యాస్ మారుతుంది. ఇది కేవలం ఇంధన సమస్యను మాత్రమే పరిషరించదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా బయోగ్యాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్పిజి వంటి ఫాసిల్ ఫ్యూయల్స్ విని యోగం వలన గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం పెరుగు తుంది. కానీ బయోగ్యాస్ వినియోగం వల్ల కార్బన్ ఉద్గా రాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే స్లర్రీను సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చు.ఇది భూమి సారాన్ని పెంచడంలో సహా యపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే బయోగ్యాస్ ప్రోత్సా హానికి అనేక పథకాలను అమలు చేస్తోంది. అయితే అవి మరింత విస్తృతంగా ప్రజలకు చేరాల్సిన అవసరం ఉంది.

 Biogas

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చడం, సబ్సిడీలు అందించడం, సాంకేతిక సహాయం కల్పిం చడం వంటి చర్యలు తీసుకుంటే, బయోగ్యాస్ వినియోగం వేగంగా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా అపా ర్ట్మెంట్లు, కాలనీలు స్థాయిలో బయోగ్యాస్ప్లాం ట్లుఏర్పాటు చేయవచ్చు. వంటింటి వ్యర్థాలను సక్రమంగా వినియోగిం చడం ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి చేయవచ్చు. ఇది చెత్త నిర్వహణ సమస్యనుకూడా పరిష్కరిస్తుంది. ముఖ్యం గా యువత ఈ దిశగా ముందుకు రావాలి. సాంకేతిక పరి జ్ఞానం ఉపయోగించి చిన్న స్థాయి బయోగ్యాస్ యూనిట్లు అభివృద్ధి చేయడం, స్టార్టప్ల రూపంలో విస్తరించడంవంటి అవకాశాలున్నాయి. ఇది ఉపాధి అవకాశాలను కూడా సృష్టి స్తుంది. మొత్తా నికి, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు మనకు ఒక స్పష్ట మైన సందేశాన్ని ఇస్తున్నాయి. ఇంధన రంగంలో స్వయంసమృద్ధి అత్యవసరం. ఎల్పిజి కొరతవంటి సమస్యలు తాత్కాలికంగా ఎదురైనా, దీర్ఘకాలిక పరిష్కారం కోసం బయోగ్యాస్ వంటిప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. ఇది కేవలం అవసరం మాత్రమేకాదు, భవిష్యత్తు తరాలకు మనం అందించాల్సిన బాధ్యత కూడా. ఇప్పటికైనామేల్కొ ని, బయోగ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించాలి.

-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ శివారులో 42 ఎకరాల ఆధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha