Solar Plant Investment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా, నెల్లూరు జిల్లాలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్‌ఈఎల్) భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
Read Also : Kalyandurg Municipality Scam: మున్సిపాలిటీలో భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలు!

రూ. 6,500 కోట్లతో భారీ ప్లాంట్
నెల్లూరు జిల్లాలో ఇంగోట్, వేఫర్ల తయారీ కోసం సుమారు రూ. 6,500 కోట్లతో ఒక ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి టీపీఆర్‌ఈఎల్ బోర్డు ఇప్పటికే అధికారికంగా ఆమోదం తెలిపింది. టాటా పవర్ వంటి దిగ్గజ సంస్థ ఇంతటి భారీ పెట్టుబడితో నెల్లూరుకు రావడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మరింత మెరుగుపడనుంది. ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచడంతో పాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

