Samantha Ruth Prabhu: టాలీవుడ్ అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల 'మా ఇంటి బంగారం' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సమంత, ఆ వెంటనే అభిమానులకు ఒక తియ్యని శుభవార్తను అందించారు.
తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి, ప్రస్తుతం నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను సామ్ అభిమానులతో పంచుకున్నారు.
Read Also : Yellamma Movie: హీరోగా దేవి శ్రీ ప్రసాద్.. 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ విడుదల
Samantha Ruth Prabhu: ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ హల్‌చల్
తన అద్భుతమైన నటన, అందంతో దాదాపు 16 ఏళ్లుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన సమంత, ఈ స్థాయిని చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం' భారీ విజయాన్ని సాధించి రూ.100 కోట్ల కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చిత్ర సక్సెస్ మీట్ సమయంలో సమంత పొట్ట భాగం ముందుకు రావడంతో ఆమె గర్భం దాల్చారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రెండ్రోజులకే తాను గర్భవతిని అని, కొన్నాళ్ల పాటు సినిమాలకు విరామం ఇస్తున్నానని ఆమె అధికారికంగా స్పష్టం చేశారు.
గర్భం దాల్చిన నాటి నుండి ఇంటికే పరిమితమైన సమంత, ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక వీడియోలు చేస్తూ అభిమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బేబీ బంప్‌తో ఉన్న తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

