Dailyhunt
బెంగాల్ ప్రచారంలో స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచిన మోడీ

బెంగాల్ ప్రచారంలో స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచిన మోడీ

వార్త 1 week ago

శ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక సామాన్యమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రతా వలయాలను పక్కన పెట్టి, సామాన్యుడిలా కిరాణా షాపులో పల్లీలు కొనుక్కోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఝామ్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఒక్కసారిగా తన కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించారు. భారీ భద్రత మధ్య సాగుతున్న ప్రధాని వాహన శ్రేణి ఆగిపోవడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ, మోదీ కారు దిగి నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న కిరాణా షాపులోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏ దేశ ప్రధాని అయినా సాధారణంగా ప్రజల మధ్యకు వెళ్లడం అరుదు, అలాంటిది ఒక మారుమూల ప్రాంతంలోని షాపులోకి వెళ్లడం ఆ ప్రాంత ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

Read Also : TG Politics: గవర్నర్‌తో సీఎం రేవంత్ కీలక భేటీ.. ఆ మంత్రి పదవికి గండం?

 PM Modi

సామాన్యుడిలా ముచ్చట్లు.. పల్లీల రుచి

షాపులోకి వెళ్లిన మోదీ అక్కడ కేవలం అతిథిలా ఉండిపోకుండా, ఒక సాధారణ కస్టమర్‌లా మారిపోయారు. అక్కడున్న పల్లీలు (వేరుశనగలు), కొన్ని చిరుతిళ్లను స్వయంగా కొనుగోలు చేశారు. వాటిని తింటూనే, ఆ షాపు యజమానితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ ప్రాంత సమస్యల గురించి, వారి జీవనశైలి గురించి ఆరా తీశారు. కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి నగదును కూడా ఆయనే స్వయంగా చెల్లించడం విశేషం. ప్రధాని తమతో అంత దగ్గరగా కూర్చుని మాట్లాడటం చూసి షాపు యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మిన్నంటిన నినాదాలు.. జనాల్లో జోష్

ప్రధాని మోదీ అకస్మాత్తుగా ప్రజల మధ్యలోకి రావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడిని అంత దగ్గరగా చూసిన స్థానికులు ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరామ్’, ‘మోదీజీ జిందాబాద్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటన మోదీకి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరోసారి నిరూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వారించినా, ప్రజల మధ్యకు వెళ్లడానికే తాను ఇష్టపడతానని ఈ చర్య ద్వారా మోదీ చెప్పకనే చెప్పారు. ఈ పల్లీల కొనుగోలు ఉదంతం బెంగాల్ ప్రచారంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎంపీ పురందేశ్వరికి కీలక పదవి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha