Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ రాజకీయాల్లో 'ఝాల్​మురీ' సెటైర్లు: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

బెంగాల్ రాజకీయాల్లో 'ఝాల్​మురీ' సెటైర్లు: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

వార్త 2 months ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆహారపు అలవాట్ల చుట్టూ తిరుగుతోంది. ప్రధాని మోదీ ఝాల్​మురీ (మసాలా మరమరాలు) కొనుగోలు చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

కోల్‌కతాలో జరిగిన సభలో మమత మాట్లాడుతూ, బీజేపీ నేతలు తమకు ఝాల్​మురీ ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. “వాళ్లు ఝాల్​మురీ ఇస్తామంటే.. మేము దిల్లీ నుంచి భేల్‌పూరీని తీసుకొచ్చి పెడతాం” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ‘చాయ్‌వాలా’ కార్డు వాడిన బీజేపీ, ఇప్పుడు ‘ఝాల్​మురీ’ కార్డుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆమె విమర్శించారు. ఇటీవల ప్రధాని మోదీ ఝార్‌గ్రామ్‌లో రోడ్డు పక్కన ఝాల్​మురీ కొన్న ఘటనపై మమత తీవ్రంగా స్పందించారు. అదంతా ముందుగా ప్లాన్ చేసిన డ్రామా అని, ఫొటోల కోసమే ఆ పని చేశారని ఆరోపించారు. భద్రత – ఇంటి భోజనం: ప్రధాని తినే ఝాల్​మురీని ఇంటి నుంచే సిద్ధం చేసి తెచ్చారని, కేవలం కెమెరాల ముందు డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. ఆయన అక్కడ ఝాల్​మురీ తినడానికి ముందే అక్కడ భద్రతా సిబ్బంది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

Read Also: Mehul Telecom: అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెహుల్ టెలికామ్

 Modi vs Mamatha

Modi vs Mamatha: ఆహారం మరియు మతంపై స్పష్టత

రాజకీయాల్లో మతాన్ని, ఆహారాన్ని కలపవద్దని మమత సూచించారు. తాను ధోక్లా, దోశ, సత్తు, మరియు రంజాన్ సమయంలో సేమియా వంటి అన్ని రకాల వంటకాలను గౌరవిస్తానని, తింటానని చెప్పారు. తనకు మతం గురించి బీజేపీ నేతలు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు గెలుపుపై వ్యక్తం చేస్తున్న అతి నమ్మకం వెనుక ఏదో కుట్ర ఉందని మమత అనుమానం వ్యక్తం చేశారు. “ఎన్నికలు జరగకముందే ఫలితాలపై అంత ధీమా ఎలా ఉంటుంది? ఈవీఎంలను ఏమైనా ఫిక్స్ చేశారా?” అని ఆమె నిలదీశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టీఎంసీదే అధికారం: మమతా బెనర్జీ ధీమా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha