Dailyhunt
బెంగాల్ సీఎం కుర్చీ లో కూర్చునేది ఎవరు ?

బెంగాల్ సీఎం కుర్చీ లో కూర్చునేది ఎవరు ?

వార్త 1 week ago

బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి రేసులో ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, అనంతరం బీజేపీలో చేరిన ఆయన..

2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించి సంచలనం సృష్టించారు. 2026 ఎన్నికల్లో కూడా పార్టీ విజయం కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. గత ఐదేళ్లుగా శాసనసభలో టీఎంసీ సర్కారును నిలదీయడంలో సువేందు కీలక పాత్ర పోషించారు. అయితే, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, కేంద్రాన్నే సీఎంను ఎంపిక చేయనివ్వాలని ఆయన పేర్కొన్నప్పటికీ, అభిమానులు మాత్రం ఆయనే బెంగాల్‌కు సరైన నాయకుడని భావిస్తున్నారు.

Read Also : మమతా ఓటమికి కారణాలు ఏంటి ?

 BJP Wins Assam

బరిలో దిలీప్ ఘోష్ మరియు షామిక్ భట్టాచార్య

రాష్ట్రంలో బీజేపీ వేళ్లూనుకోవడానికి కారణమైన మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయనతో పాటు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు షామిక్ భట్టాచార్య పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈయన మృదు స్వభావిగా, అందరినీ కలుపుకుని పోయే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఒకవేళ పార్టీ ఏదైనా సర్ప్రైజ్ నిర్ణయం తీసుకోవాలని భావిస్తే, వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ముఖ్యంగా ‘బంగారు బెంగాల్’ నిర్మాణం కోసం పార్టీ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మహిళా కోటాలో అగ్నిమిత్ర పాల్.. యువ నాయకత్వం వైపు శంకర్ ఘోష్?

మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన జాతీయ అధికార ప్రతినిధి అగ్నిమిత్ర పాల్ పేరు కూడా వినిపిస్తోంది. బెంగాల్‌లో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఆమె చేసిన పోరాటాలు పార్టీకి కలిసొచ్చాయి. ఒకవేళ బీజేపీ మహిళా ముఖ్యమంత్రిని నియమించాలనుకుంటే అగ్నిమిత్ర పాల్ రేసులో ముందుంటారు. వీరికి తోడుగా సిలిగుడి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉత్తర బెంగాల్‌లో పార్టీ పటిష్టతకు ఆయన చేసిన సేవలు గుర్తింపు పొందాయి. మొత్తం మీద 206 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ, బెంగాల్ సంస్కృతిని ప్రతిబింబించే ఒక బలమైన నాయకుడిని ఎంచుకోవాలని చూస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha