Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. బీజేపీ గుర్తు స్వీట్ల సందడి!

బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. బీజేపీ గుర్తు స్వీట్ల సందడి!

వార్త 3 months ago

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికార పగ్గాలను చేపట్టింది.

నేడు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న వేడుకలో సువేందు అధికారి బెంగాల్‌ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also : Makhan Lal Sarkar: మోదీ సంస్కారం.. 98 ఏళ్ల వృద్ధ నేతకు పాదాభివందనం

West Bengal: కాషాయమయమైన కోల్‌కతా.. ప్రత్యేక స్వీట్ల సందడి

సువేందు అధికారి ప్రమాణ స్వీకార వేడుక నేపథ్యంలో కోల్‌కతా నగరం మొత్తం కాషాయ రంగు పులుముకుంది. నగరం నలుమూలలా బీజేపీ జెండాలు, బ్యానర్లు వెలిశాయి. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా కోల్‌కతాలోని ప్రసిద్ధ మిఠాయి దుకాణాలు ఈ వేడుకను వినూత్నంగా జరుపుకుంటున్నాయి. బీజేపీ పార్టీ గుర్తు అయిన కమలం’ ఆకారంలో ప్రత్యేక స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. బెంగాల్ అంటేనే ఫేమస్ అయిన రసగుల్లాలు కూడా ఇప్పుడు కాషాయ రంగులో దర్శనమిస్తుండటం విశేషం.

బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు

లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు తరలివస్తున్నారు. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెంగాల్‌లో శాంతిభద్రతలు, అభివృద్ధిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

త్రిష వల్లే విజయ్‌కు దరిద్రం అంటున్న వేణుస్వామి.. ఎందుకు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha