Dailyhunt
బెంగాల్‌లో ఎన్నికల సెగ.. TMC కార్యాలయాలకు నిప్పు!

బెంగాల్‌లో ఎన్నికల సెగ.. TMC కార్యాలయాలకు నిప్పు!

వార్త 3 days ago

West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యాలయాలపై దాడులు జరగడం కలకలం రేపుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోమవారం నుంచి బెంగాల్‌లోని పలు జిల్లాల్లో హింస చెలరేగింది. జమురియాలోని రతీ బాతీ ప్రాంతంలో టీఎంసీ కార్యాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నిప్పంటించారు. అలాగే హౌరా, బరాసత్, అసన్సోల్ పరిధిలోని బరాబాని వంటి ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడమే కాకుండా, పార్టీ పోస్టర్లను, ఫ్లెక్సీలను దుండగులు చింపివేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నన్ను కొట్టారు.. ప్రజా తీర్పును దొంగిలించారు: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha