Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ..రెండింట్లో సిలికాన్ వ్యాలీ ఏది?

బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ..రెండింట్లో సిలికాన్ వ్యాలీ ఏది?

వార్త 3 months ago

భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి ఐటీ నగరాలైన బెంగళూరు (Bangalore), హైదరాబాద్ (Hyderabad)మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం బిజినెస్ పరంగానే కాకుండా ఆహారం, సంస్కృతి , జీవనశైలి విషయంలో కూడా నిరంతరం పోలికలు జరుగుతూనే ఉంటాయి.

తాజాగా విడుదలైన ‘వీ ఆర్ సిటీ 2026’ (WeAreCity 2026) నివేదిక ఈ చర్చను డేటా ఆధారంగా విశ్లేషించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లుగా మారిన ఈ రెండు నగరాల్లో ఏది ఎక్కడ ముందంజలో ఉందో అని గమనిస్తే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులు 2019 నుండి 2024 మధ్య కాలంలో దేశంలోని టాప్ 7 నగరాల్లో అదనంగా చేరిన ప్రైమ్ ఆఫీస్ స్పేస్‌ లో 53 శాతం వాటా ఈ రెండు నగరాలదే. అంతేకాకుండా, దేశీయ విమాన సర్వీసుల్లో సగం, అలాగే ప్రధాన రంగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో 40-50 శాతం వాటాను బెంగళూరు (Bengaluru) , హైదరాబాద్ కలిగి ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో టాప్ 8 నగరాల్లో నమోదైన కొత్త కంపెనీల్లో ప్రతి నాలుగు కంపెనీల్లో ఒకటి ఈ రెండునగరాల నుండే రావడం గమనార్హం.

 Bangalore, Hyderabad

Bangalore, Hyderabad: బెంగళూరు ఎక్కడ ముందంజలో ఉంది?

స్టార్టప్ రాజధానిగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో బెంగళూరు సుమారు $42.3 బిలియన్ల స్టార్టప్ ఫండింగ్‌ ను ఆకర్షించగా, హైదరాబాద్ కేవలం $1.3 బిలియన్లకే పరిమితమైంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో బెంగళూరుకు వస్తున్న నిధులు హైదరాబాద్ కంటే 72 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. పేటెంట్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) , హై ఎండ్ టెక్ రోల్స్‌ లో బెంగళూరు గ్లోబల్ ర్యాంకింగ్స్‌ లో 14 వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ వేగంగా పుంజుకుంటోంది! అయితే, ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. గత ఐదేళ్లలో బెంగళూరు 69 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ ను జోడిస్తే, హైదరాబాద్ 66 మిలియన్ చదరపు అడుగులతో దాదాపు సమానంగా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఎమ్మెల్యేపై ఫేక్ న్యూస్ ప్రచారం.. యువకుడికి 5 రోజుల జైలు శిక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha