Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్యేపై ఫేక్ న్యూస్ ప్రచారం.. యువకుడికి 5 రోజుల జైలు శిక్ష

ఎమ్మెల్యేపై ఫేక్ న్యూస్ ప్రచారం.. యువకుడికి 5 రోజుల జైలు శిక్ష

వార్త 3 months ago

Maharashtra Council Verdict: మహారాష్ట్ర శాసనమండలి తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.

ప్రజాప్రతినిధులపై అసత్య ఆరోపణలు చేసినందుకు గానూ ఒక యువకుడికి జైలు శిక్ష విధించడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.మహారాష్ట్ర శాసనమండలి చైర్మన్ రామ్ షిండే నేతృత్వంలో బుధవారం ఈ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read Also:Poor Food Quality Fine IRCTC: వందే భారత్ లో నాసిరకం భోజనం.. రూ. 10 లక్షల జరిమానా!

Maharashtra Council Verdict: వివాదం నేపథ్యం

'సత్య లధా' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీపై అంకుష్ గవాండే, మరికొందరు తప్పుడు వార్తలు ప్రసారం చేశారు.ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన మండలి, నిందితులను వ్యక్తిగతంగా హాజరై క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలో గణేష్ సోనవనే, హర్షదా సోనవనే, అమోల్ నందుర్కర్ అనే ముగ్గురు వ్యక్తులు సభకు హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీంతో వారి పట్ల కొంత మెతక వైఖరి ప్రదర్శించిన సభ..

Maharashtra Legislative Council Jail Sentence

హెచ్చరికతో వారిని వదిలివేసింది.అయితే ప్రధాన నిందితుడు అంకుష్ గవాండే మాత్రం సభ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హాజరు కాలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన శాసన మండలి.. మంగళవారం ప్రతిపాదించిన 5 రోజుల జైలు శిక్షా తీర్మానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. "సభకు హాజరై క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ గవాండే రాలేదు. అందుకే అతడికి శిక్షను అమలు చేయాల్సిందే" అని చైర్మన్ రామ్ షిండే స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మార్కాపురం మృతులకు ప్రధాని మోదీ సంతాపం.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha