Dailyhunt
Bengaluru House Rents: రూ. 80 వేలకు అద్దె ఫ్లాట్.. సూర్యకాంతి కారణమా?

Bengaluru House Rents: రూ. 80 వేలకు అద్దె ఫ్లాట్.. సూర్యకాంతి కారణమా?

వార్త 1 month ago

Bengaluru House Rents: బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయం, ముఖ్యంగా గృహ అద్దెలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రోజురోజుకు నగరంలో నివాసం ఉండటం సామాన్యులకు భారంగా మారుతోంది.

గాలి, వెలుతురు వంటి కనీస సదుపాయాలకు కూడా భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

Read Also: Thalapathy vijay: 'జన నాయగన్' ఇప్పట్లో లేనట్టేనా!

సూర్యకాంతి వస్తే రూ.80 వేల అద్దె!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఘటన ప్రజలను ఆశ్చర్యపరిచింది. బెంగళూరులో ఓ మహిళ రూ. 80,000 అద్దె ఉన్న ఫ్లాట్ వివరాలను పంచుకుంది. ఆ ఇంటికి మంచి సూర్యకాంతి (Sunlight) వస్తుందనే కారణంతో యజమాని అంత పెద్ద మొత్తంలో అద్దె డిమాండ్ చేయడం విశేషం.

సామాన్యులపై అద్దెల భారం

ఈ పోస్ట్ వైరల్ కావడంతో, చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. నగరంలో అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బెంగళూరులో నివసించడం ఒక సవాలుగా మారిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha