Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thalapathy vijay: 'జన నాయగన్' ఇప్పట్లో లేనట్టేనా!

Thalapathy vijay: 'జన నాయగన్' ఇప్పట్లో లేనట్టేనా!

వార్త 4 months ago

భిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దళపతి విజయ్ (Thalapathy vijay) ఆఖరి సినిమా జన నాయగన్ ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, తాజాగా రిలీజ్ విషయంలో మరింత అనిశ్చితి నెలకొంది..

సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.

Ravitej: 'ఇరుముడి'లో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్

రిలీజ్ ఇంకా వెనక్కి వెళ్లే అవకాశాలు

తాజాగా కెనడా డిస్ట్రిబ్యూటర్ York Cinemas విడుదల చేసిన ప్రకటన మరింత చర్చకు దారితీసింది. తమ అధికారిక ప్రకటనలో 'జన నాయగన్ చిత్రం ఏప్రిల్ 30కు ముందు విడుదల కాదని, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు రిఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు' అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో 'జన నాయగన్' ఫిబ్రవరిలో విడుదల కానుందన్న ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఈ చిత్రం వేసవి కానుకగా మే నెలలో విడుదల కావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అదే సమయంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రిలీజ్ ఇంకా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha