Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరు (RCB).. 12.4 ఓవర్లలో 129/2

బెంగళూరు (RCB).. 12.4 ఓవర్లలో 129/2

వార్త 2 months ago

RCB IPL Live Score: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

అయితే, చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్‌ను ఆర్సీబీ కోల్పోయింది.

కోహ్లీ అవుట్ – చెన్నైకి ఊరట

తొలుత శివమ్ దూబే చేతిలో క్యాచ్ డ్రాప్ అయి బతికిపోయిన విరాట్ కోహ్లీ (28), ఆ అవకాశాన్ని భారీ స్కోరుగా మార్చుకోలేకపోయాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి దొరికిపోయాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. మరోవైపు అద్భుతంగా ఆడుతున్న ఫిలిప్ సాల్ట్ (46) కూడా అర్థ సెంచరీకి చేరువలో శివమ్ దూబే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

RCB IPL Live Score: పడిక్కల్, పాటిదార్ మెరుపులు

రెండు కీలక వికెట్లు పడినా ఆర్సీబీ రన్ రేట్ తగ్గకుండా దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ బాధ్యత తీసుకున్నారు. పడిక్కల్ కేవలం 22 బంతుల్లోనే 35 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోగా, పాటిదార్ వస్తూనే సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 12.4 ఓవర్లలో 129 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే ఆర్సీబీ 200 పరుగుల మార్కును సులభంగా దాటే అవకాశం ఉంది. చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ తన స్పెల్‌తో ఈ జోడీని అడ్డుకోవాలని చూస్తున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కష్టాల్లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆదుకున్న యువ బ్యాటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha