Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కష్టాల్లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆదుకున్న యువ బ్యాటర్

కష్టాల్లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆదుకున్న యువ బ్యాటర్

వార్త 2 months ago

Nitish Kumar Reddy: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి తడబడిన తరుణంలో, యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతమైన ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు.

లక్నో బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అవేశ్ ఖాన్ వేసిన 16.2వ బంతికి సింగిల్ తీసి, కేవలం 30 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్లిష్ట సమయంలో నితీశ్ ఆడిన ఇన్నింగ్స్ హైదరాబాద్ అభిమానులలో కొత్త ఆశలు చిగురింపజేసింది.

Read Also:SRH vs LSG Match Score: ఉప్పల్ లో సన్‌రైజర్స్ తడబాటు: 156 పరుగులకే పరిమితమైన ఆరెంజ్ ఆర్మీ

 Nitish Reddy rains sixes… completes his half-century in just 30 balls.

Nitish Kumar Reddy: 30 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ‘తగ్గేదే లే’ అంటూ అదిరిపోయే సెలబ్రేషన్!

నితీశ్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు మరియు 4 భారీ సిక్సర్లతో విరుచుకుపడి స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం అర్ధశతకం సాధించడమే కాకుండా, తన హాఫ్ సెంచరీ పూర్తయ్యాక బ్యాట్‌తో ‘తగ్గేదే లే’ అంటూ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 ఓవర్లు ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 134/4కు చేరుకుంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండటంతో, ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోరు సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఉప్పల్‌ స్టేడియంలో అభిమానుల సందడి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha