Dailyhunt
బెట్టింగ్లు, జూదంపై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా

బెట్టింగ్లు, జూదంపై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా

వార్త 1 week ago

IPL Betting cases: రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ పేరిట జరుగుతున్న అన్ని రకాల బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధితమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి అమలు చేస్తున్న చర్యలపై డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో ఆదివారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో అధికారులందరూ అక్రమ బెట్టింగ్, జూద కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Read also: Kalyanadurgam Financial Fraud: విదేశీ నిధుల పేరుతో రూ. 3 కోట్ల వసూలు.. వైసీపీ నాయకుడిపై కేసు!

Police Monitoring IPL Cricket Betting

IPL Betting cases: బెట్టింగ్‌లపై డీజీపీ కఠిన ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పోలీసు బృందాలు బెట్టింగ్ నెట్వర్క్లపై దాడులు ముమ్మరం చేశాయన్నారు. జూదాలకుబెట్టింగ్ లకు వేదికలుగా ఉన్న క్లబ్బులు, ఇతర స్థావరాలను ఇప్పటికే మూసివేయించడంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లను గుర్తించి సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బ్లాక్ చేసే చర్యలు చేపడుతూ రాష్ట్రంలో బెట్టింగ్ కార్యకలాపాలు చెక్ పెడుతున్నారన్నారని వివరించారు.

ఐపీఎల్ జూదంపై పోలీసుల నిఘా

బుకీలు, ఏజెంట్లు, బెట్టింగ్లో పాల్గొనే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఈ నేరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్ పరిగణించి తీవ్ర చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారన్నారు. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఇప్పటికే గుర్తించి ఫ్రీజ్ చేస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన, వారికి సహకరించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తూ పదే పదే గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లకు పాల్పడుతున్న నేరస్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్, చర్యలు తీసుకోవాలని డీజీపీ ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఆదేశించారు. అక్రమ బెట్టింగ్ ద్వారా సంపాదించిన లేదా ఉపయోగిస్తున్న ఆస్తులను గుర్తించి చట్టప్రకారం అటాచ్ చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ సందర్భంగా తెలిపారు.

బెట్టింగ్ ముఠాల నెట్‌వర్క్‌పై పోలీసుల మెరుపు దాడులు

ఐపీఎల్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఇప్పటికే ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. గ్రామ, వార్డు స్థాయిలో ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ చేపడుతూ, ప్రత్యేక బృందాలతో బెట్టింగ్ నెట్వర్క్లను చేధిస్తూ నమోదైన కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపి సమర్థవంతమైన అభియోగపత్రాలు దాఖలు చేసేలా పర్యవేక్షిస్తున్నారన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లపై నిరంతర నిఘా కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా యువతకు బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్, జూదాలకు దూరంగా ఉండాలని ప్రజలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఉపాధి హామీపై జాతీయ ఉద్యమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha