K Bhagyaraj death: చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన కథలు, స్క్రీన్‌ప్లేతో ఇండస్ట్రీని శాసించిన లెజెండరీ డైరెక్టర్ కే భాగ్యరాజ్ హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.
73 ఏళ్ల వయసులో గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 50 ఏళ్ల కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, సింగర్‌గా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ మరణంతో సినీరంగానికి తీరని లోటు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం భాగ్యరాజ్ మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Venkatesh’s emotional post on Bhagyaraj’s death!
K Bhagyaraj death: రెండు రోజుల క్రితమే ఖుష్బూ కుమార్తె పెళ్లిలో సందడి!
రెండ్రోజుల క్రితం గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె అవంతిక – శ్రవణ్ శ్రీనివాసన్‌ల వివాహానికి దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కపూర్, జాకీష్రాఫ్, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలతో పాటు భాగ్యరాజ్ కూడా హాజరయ్యారు. చాలారోజుల తర్వాత మిత్రులంతా ఒక్క చోటే చేరడంతో అంతా గోల గోల చేశారు, చిరంజీవి, వెంకటేష్‌లతో ఉన్న భాగ్యరాజ్ వీడియో వైరల్ అవుతోంది.
ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్ భాగ్యరాజ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. భాగ్యరాజ్ గారి మరణవార్త కలచివేసింది. ఆయన కథలు భాషలకు అతీతంగా లక్షలాది హృదయాలను తాకాయి. భాగ్యరాజ్ కథనం నుంచి పుట్టిన సుందరకాండ, అబ్బాయిగారు వంటి చిత్రాలలో భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. భారతీయ సినిమా తన అత్యుత్తమ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయ పూర్వక సంతాపం అని వెంకటేష్ రాసుకొచ్చారు. సినిమా రంగంలో స్క్రీన్‌ప్లే విభాగంలో మైలురాళ్ళు సృష్టించిన భాగ్యరాజ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను వీడనున్న సల్మాన్ ఖాన్: కారణం ఏమిటంటే!

