Sugar Export Ban India: దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు సామాన్యుడికి భారంగా మారకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశం నుంచి చక్కెర ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also:Price Hike : సామాన్య ప్రజలకు వరుస షాకులు !!
ధరల నియంత్రణే ప్రధాన లక్ష్యం
గత కొంతకాలంగా దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గడం, ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో కేంద్రం ముందస్తు చర్యలకు దిగింది.
- అన్ని రకాల చక్కెరకు వర్తింపు: ఈ నిషేధం ముడి చక్కెర (Raw Sugar), తెల్ల చక్కెర మరియు రిఫైన్డ్ చక్కెరకు కూడా వర్తిస్తుందని డీజీఎఫ్‌టీ (DGFT) స్పష్టం చేసింది.
- కేటగిరీ మార్పు: గతంలో ‘నియంత్రిత’ (Restricted) విభాగంలో ఉన్న చక్కెర ఎగుమతులను, ఇప్పుడు ప్రభుత్వం ‘నిషేధిత’ (Prohibited) కేటగిరీలోకి మార్చింది. దీనివల్ల ఎలాంటి ముందస్తు అనుమతులు ఉన్నా ఎగుమతులకు వీలు పడదు.
India Sugar Export Ban 2026
ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Sugar Export Ban India: రైతులు, పరిశ్రమల పరిస్థితి
ఈ నిర్ణయం వినియోగదారులకు ఊరటనిచ్చినప్పటికీ, ఎగుమతులపై ఆధారపడిన చక్కెర మిల్లులు మరియు విదేశీ ఆర్డర్లు ఉన్న వ్యాపారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలను ఉంచడమే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం పేర్కొంది.చక్కెర ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధం విధించినప్పటికీ.. కొన్ని పాత ఒప్పందాలకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు ఇప్పటికే ఉన్న టారిఫ్ రేట్ కోటా, ప్రత్యేక ఒప్పందాల కింద జరిగే ఎగుమతులకు ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

