Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో నాకు మంచి గుర్తింపు ఉంది : బెంజిమన్ నెతన్యహూ

భారత్‌లో నాకు మంచి గుర్తింపు ఉంది : బెంజిమన్ నెతన్యహూ

వార్త 3 weeks ago

PM Netanyahu: ఇండియాలో తనకు మద్దతు ఎక్కువగా ఉందని, ఫాలోవర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఇజ్రాయిల్‌, ఇండియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన మాట్లాడారు.

ప్రాంతీయ వ్యూహాత్మకం, కూటమి, టెక్నాలజీ వృద్ధిపై ఆయన ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ.. భారత్ తమకు కీలకమైన భాగస్వామి అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఇజ్రాయిల్‌ను వేరుగా చూస్తున్నాయని ఆరోపించారు. కానీ భారత్‌లో మాత్రం తమకు మంచి గుర్తింపు ఉన్నట్లు నెతన్యహూ చెప్పారు.

Read Also: UN Blacklist: ఐరాస బ్లాక్‌లిస్ట్‌లో రష్యా, ఇజ్రాయెల్ : అంతర్జాతీయ వేదికపై అగ్గిరాజిన నివేదిక!

 PM Netanyahu

PM Netanyahu: భారత్‌ గొప్ప శక్తి

భారత్‌లో ఇజ్రాయిలీలకు అమితమైన ప్రేమ ఉందని, నిజంగా ఎక్కువగా అభిమానిస్తారని, ఇతర దేశాల కన్నా ఇండియాలో తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నట్లు నెతన్యహూ తెలిపారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ శక్తులతో స్నేహ హస్తాన్ని చాచేందుకు ఇజ్రాయల్ ప్రయత్నిస్తున్నది. ఈ సందర్భంగా నెతన్యహూ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్‌ను గొప్ప శక్తిగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ పోల్చారు. పశ్చిమాసియా దేశాలతో ఉన్న పరిస్థితిని మరింత బలోపేతం చేయాలన్నారు. వివిధ దేశాలతో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని భావిస్తున్నామని, భారత్ లాంటి గొప్ప శక్తివంతమైన దేశంతో మరింత విశిష్టమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయిలీ సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధి పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, దీనిలో భాగంగానే కొన్ని దేశాలు తమతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ' విజేతగా నిలిచిన శ్రేయ్ పారిఖ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha