Huawei MatePad SE 11: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హువావే (Huawei) భారత మార్కెట్లోకి రెండు సరికొత్త ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హువావే మేట్‌ప్యాడ్ ఎస్‌ఈ 11 (Huawei MatePad SE 11) మరియు హువావే మేట్‌ప్యాడ్ 11.5 పేపర్‌మ్యాట్ ఎడిషన్ (Huawei MatePad 11.5 PaperMatte Edition) మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది.
విద్యార్థుల చదువులకు, ఆఫీస్ ఉద్యోగుల పనులకు అత్యంత సులభంగా ఉపయోగపడేలా ఈ ట్యాబ్లెట్లను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో కొనుగోలుకు లభిస్తున్నాయి.
Read Also :EV sales growth: పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీల జోరు

హువావే మేట్‌ప్యాడ్ 11.5 పేపర్‌మ్యాట్ ఎడిషన్ (MatePad 11.5 PaperMatte Edition):
- ధర: రూ. 45,999 (ఈ మోడల్‌తో ఉచితంగా కీబోర్డ్ లభిస్తుంది).
- డిస్‌ప్లే: 11.5 అంగుళాల 2.5K స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్. కళ్లపై ఒత్తిడి పడకుండా స్క్రీన్ లైట్ తగ్గించే ప్రత్యేక యాంటీ-గ్లేర్ సాంకేతికత.
- ప్రాసెసర్ & స్టోరేజ్: కిరిన్ టీ82బి (Kirin T82B) ప్రాసెసర్, 8 GB RAM, 256 GB అంతర్గత స్టోరేజ్.
- బ్యాటరీ & చార్జింగ్: 10,100 mAh భారీ బ్యాటరీ, 40W ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం.
- కెమెరా: 13 MP వెనుక కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా.
- ప్రత్యేక ఫీచర్లు: కొత్త 'నోట్స్ యాప్' ద్వారా చేతిరాత నోట్స్ రాయడం, డాక్యుమెంట్లను మార్క్ చేయడం సులభం.
Huawei MatePad SE 11: హువావే మేట్‌ప్యాడ్ ఎస్‌ఈ 11 (MatePad SE 11):
- ధర: రూ. 25,999.
- డిస్‌ప్లే: 11 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) 'ఐ కంఫర్ట్' స్క్రీన్.
- ప్రాసెసర్ & స్టోరేజ్: కిరిన్ 710ఏ (Kirin 710A) ప్రాసెసర్, 8 GB RAM, 128 GB అంతర్గత స్టోరేజ్.
- బ్యాటరీ & చార్జింగ్: 7,700 mAh బ్యాటరీ, 22.5W ఫాస్ట్ చార్జింగ్.
- కెమెరా & ఆడియో: 8 MP వెనుక కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా, నాణ్యమైన సౌండ్ కోసం 4 స్పీకర్ల సెటప్.
- స్టైలస్ సపోర్ట్: ఈ ట్యాబ్లెట్ స్టైలస్ (Stylus Pen) కు సపోర్ట్ చేస్తుంది.

