India Nepal Border : భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని బాలేన్ షా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల్లో రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ముఖ్యంగా కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల విషయంలో బ్రిటన్ కూడా పాత్ర పోషించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కొత్త మలుపు తిప్పాయి.
సుగౌలీ ఒప్పందమే వివాదానికి మూలం
నేపాల్ వాదన ప్రకారం, ఈ వివాదానికి మూలం 1816లో కుదిరిన సుగౌలీ ఒప్పందం. ఆంగ్లో-నేపాల్ యుద్ధం అనంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో నేపాల్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఆ ఒప్పందంలో మహాకాళి నదిని సరిహద్దుగా గుర్తించారు. అయితే ఆ నది అసలు మూల ప్రాంతం ఏదనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి.
నేపాల్ ప్రకారం లింపియాధురా ప్రాంతమే మహాకాళి నది మూలం కావడంతో కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమ భూభాగంలో భాగమని వాదిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం ఈ ప్రాంతాలు చారిత్రకంగా ఉత్తరాఖండ్‌లో భాగమని, దశాబ్దాలుగా అక్కడ భారత పరిపాలనా నియంత్రణ కొనసాగుతోందని చెబుతోంది.
India Nepal Borderభారత్ వైఖరి స్పష్టం
ఈ అంశంలో మూడో దేశం జోక్యానికి తావులేదని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా వివాదం పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, దీనిని భారత్-నేపాల్ నేరుగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఢిల్లీ అభిప్రాయపడుతోంది.
ఇదే సమయంలో బాలేన్ షా చేసిన మరో వ్యాఖ్య నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. “భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించింది” అని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం నేపాల్ విదేశాంగ శాఖ వివరణ ఇస్తూ, ఆయన వ్యాఖ్యలు ప్రధాన సరిహద్దు వివాదాలను కాకుండా స్థానిక స్థాయిలో తలెత్తే సమస్యలను ఉద్దేశించాయని తెలిపింది. అయినప్పటికీ ఈ అంశం నేపాల్‌లో రాజకీయంగా వేడెక్కుతోంది. సరిహద్దు వివాదానికి చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

