Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌తో వాణిజ్యం బంద్‌.. పాకిస్థాన్‌కు రూ.3.5 లక్షల కోట్ల నష్టం!

భారత్‌తో వాణిజ్యం బంద్‌.. పాకిస్థాన్‌కు రూ.3.5 లక్షల కోట్ల నష్టం!

వార్త 3 weeks ago

India Pakistan Trade: భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడం పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని పాక్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌ ఖసూరి వెల్లడించారు.

2019 నుంచి ఇప్పటివరకు సుమారు 40 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.5 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వివరించారు. గతంలో భారత్‌ నుంచి సులభంగా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం ఇప్పుడు పాకిస్థాన్‌ దూర ప్రాంతాల్లోని దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ఖసూరి చెప్పారు. దీనివల్ల రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు వస్తువులు చేరేందుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. ముఖ్యంగా భారత్‌ నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకునే పాకిస్థాన్‌ ఔషధ పరిశ్రమపై ఈ పరిణామం ప్రభావం చూపిందని పేర్కొన్నారు. భారత్‌తో తిరిగి వాణిజ్యం ప్రారంభిస్తే ఏటా 2 నుంచి 3 బిలియన్‌ డాలర్లు ఆదా చేయవచ్చని అంచనా వేశారు.

Read Also :India, Israel Vote Against Pakistan : పాకిస్థాన్‌ మద్దతుతో ప్రవేశపెట్టిన ఐరాస ఆయుధ నియంత్రణ తీర్మానానికి భారత్‌, ఇజ్రాయెల్‌ వ్యతిరేక ఓటు

పత్తి దిగుమతులతో వస్త్ర పరిశ్రమపై భారం

పాకిస్థాన్‌లో దేశీయ పత్తి ఉత్పత్తి తగ్గడంతో వస్త్ర పరిశ్రమపై అదనంగా 5 బిలియన్‌ డాలర్ల భారం పడిందని ఖసూరి తెలిపారు. అవసరమైన పత్తి కోసం బ్రెజిల్‌, ఈజిప్ట్‌, చైనా, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోందన్నారు. పత్తి సాగు చేసే ప్రాంతాల్లో రైతులు చెరకు సాగు వైపు మళ్లుతుండటంతో భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అనేక రంగాలపై వాణిజ్య విరామం ప్రభావం

చక్కెర, ఎరువులు, సిమెంట్‌, పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, కూరగాయలు, భారీ యంత్రాల కోసం కూడా పాకిస్థాన్‌ దూర దేశాలపై ఆధారపడుతోందని ఖసూరి వివరించారు. భారత్‌తో వాణిజ్యం పునరుద్ధరిస్తే రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. పెట్రోలియం దిగుమతులపై పడుతున్న భారాన్ని కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

India Pakistan Trade: పర్యాటక రంగానికీ నష్టం

వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడం వల్ల పర్యాటక రంగంపైనా ప్రభావం పడిందని ఖసూరి తెలిపారు. గతంలో భారత పర్యాటకులు పాకిస్థాన్‌లోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు తమ పూర్వీకుల గ్రామాలను సందర్శించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పర్యాటక ఆదాయాన్ని కూడా కోల్పోతున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, కుటుంబ సంబంధాలు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు..పెరిగిన చమురు ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha