ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇండియా విదేశీవిధానంలో అద్భుతమైన ప్రగతిపథంలో దూసుకుని వెళుతున్నది. తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వియత్నాం పర్యటనలో వున్నారు.
భారత్, వియత్నాం దేశాల మధ్య వ్యూహాత్మక మరియు రక్షణ సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వియత్నాంలో పర్యటించి, ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిపారు. వియత్నాం రాజధాని హనోయిలో ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్‌తో రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఫలవంతమైన ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని, ప్రాంతీయ భద్రతా పరిస్థితులను ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు.
Read Also: San Diego Mosque Shooting: శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
Rajnath Singh
Rajnath Singh: కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యంగా క్రింది రంగాలలో సహకారాన్ని విస్తరించుకోవడంపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడటంలో సముద్ర భద్రతపై కీలక చర్చలు జరిగాయి.రక్షణ పరిశ్రమ మరియు సైనిక శిక్షణ: రక్షణ రంగ సాంకేతికత మార్పిడి, సంయుక్త సైనిక విన్యాసాలు మరియు శిక్షణను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. ప్రాంతీయంగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కాపాడటానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ రంగాలలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU). ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో వినియోగించుకోవడానికి ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది భారత్-వియత్నాంల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. వియత్నాం పర్యటన విజయవంతం కావడంపై రక్షణ మంత్రి ఎక్స్‌లో హర్షం వ్యక్తం చేశారు. ”
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
భారత్-నార్వే బంధానికి స్వర్ణయుగం ప్రధాని మోదీ

