Movie Ticket Prices: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు మరియు ప్రదర్శనలకు సంబంధించి రాష్ట్ర హోం శాఖ నూతన మార్గదర్శకాలను వెలువరించింది. రూ. 100 కోట్లకు పైబడి నిర్మించిన చిత్రాలను 'సూపర్ హై-బడ్జెట్' చిత్రాలుగా వర్గీకరించారు.
ఇలాంటి భారీ చిత్రాలు విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

సినీ కార్మికుల సంక్షేమ నిధికి విధిగా కోటి రూపాయల డిపాజిట్
భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు టికెట్లు పెంచుకోవాలంటే ఒక ప్రత్యేక నిబంధనను పాటించాల్సి ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ సంక్షేమ కమిటీ ఖాతాలో నిర్మాతలు ముందుగా రూ. కోటి డిపాజిట్ చేయాలి. ఈ నిధిని కార్మిక శాఖ, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్ల యూనియన్ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ, సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.
Movie Ticket Prices: చిన్న సినిమాల ప్రోత్సాహానికి ప్రత్యేక షోలు
చిన్న చిత్రాలకు తగిన ఆదరణ కల్పించే ఉద్దేశంతో థియేటర్లలో రోజుకు ఐదు షోల (ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు) ప్రదర్శనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పండుగ రోజులతో పాటు సాధారణ రోజుల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోను తప్పనిసరిగా చిన్న సినిమాల ప్రదర్శనకే కేటాయించాలనే నిబంధనను అమలులోకి తెచ్చారు.
జీఎస్టీ, నిర్వహణ చార్జీలు మరియు సీట్ల కేటగిరీ నిబంధనలు
టికెట్ ధరలపై జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. నిర్వహణ ఖర్చుల కింద ఏసీ థియేటర్లు రూ. 5, ఎయిర్-కూల్డ్ థియేటర్లు రూ. 3 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చు. ప్రతి థియేటర్‌లోనూ కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద ఉంచడం తప్పనిసరి. అలాగే మల్టీప్లెక్స్‌లతో సమానమైన వసతులున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ‘స్పెషల్ థియేటర్’గా గుర్తిస్తుంది.
Epaper: epaper.vaartha.com
కొండా సుస్మిత వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ ఆరా.. కాంగ్రెస్‌లో ఉత్కంఠ

