Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే

వార్త 1 month ago

Stock market: గురువారం ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లాయి. ఉదయం మార్కెట్ మొదలవగానే సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు కిందకు పడిపోయింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 76,623 వద్ద, నిఫ్టీ 23,899 వద్ద ట్రేడ్ అవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.

Read also: Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్ !

 Stock market red index chart downward

Stock market: చమురు సెగతో పతనం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్‌ను భయపెట్టాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీనివల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ ప్రభావం అన్ని రంగాల షేర్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

రికార్డు కనిష్టానికి రూపాయి

స్టాక్ మార్కెట్ పతనంతో పాటు భారత రూపాయి విలువ కూడా భారీగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 95.07 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారి సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మే 1వ తేదీన వంటగ్యాస్ ధరల సవరణ..బాదుడు తప్పదా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha