Dailyhunt
క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్ !

క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్ !

వార్త 1 week ago

క్రెడిట్ కార్డు వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీపి కబురు అందించింది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు, పెనాల్టీల విధింపులో బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన నిబంధనలను సవరిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మార్పులు వినియోగదారులకు ఆర్థికంగా భారీ ఊరటనివ్వడమే కాకుండా, బ్యాంకుల ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయనున్నాయి.

సాధారణంగా క్రెడిట్ కార్డు డ్యూ డేట్ ఒక్క రోజు దాటినా బ్యాంకులు భారీగా లేట్ పేమెంట్ ఫీజులు, వడ్డీలు వసూలు చేస్తుంటాయి. అయితే, ఆర్‌బీఐ తాజా ఆదేశాల ప్రకారం.. బిల్లు గడువు ముగిసిన తర్వాత 3 రోజుల వరకు చెల్లింపులు జరగకపోయినా దానిని ‘పాస్ట్ డ్యూ’ (Past Due) లేదా డిఫాల్ట్‌గా పరిగణించకూడదు. అంటే, సాంకేతిక కారణాల వల్ల లేదా మరేదైనా కారణంతో ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా వినియోగదారులపై పెనాల్టీ భారం పడదు. ఈ 3 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాతే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడటం లేదా అదనపు ఛార్జీలు విధించడం వంటి చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Read Also : MI vs SRH Toss Live Update: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌పైనే ఫీజు

చాలా బ్యాంకులు బిల్లు చెల్లింపులో చిన్నపాటి మొత్తం బ్యాలెన్స్ ఉన్నా, మొత్తం బిల్లు (Total Amount) పై వడ్డీని లెక్కిస్తూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ఆర్‌బీఐ మరో కీలక సవరణ చేసింది. ఇకపై డ్యూ డేట్ దాటితే, కేవలం చెల్లించాల్సిన మిగిలిన మొత్తం (Outstanding Amount) పై మాత్రమే ఫీజు లేదా వడ్డీని లెక్కించాలని, మొత్తం బిల్లుపై కాదని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల పొరపాటున కొంత మొత్తం చెల్లించకపోయినా, యూజర్లు భారీ జరిమానాల నుండి తప్పుకోవచ్చు.

అమలు ఎప్పటి నుండి? పారదర్శకతకు పెద్దపీట

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు వినియోగదారులకు మరింత ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేయడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతాయి. ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. అప్పటి నుండి అన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు కచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. కార్డు వాడకందారులు తమ బిల్లుల విషయంలో అనవసరపు ఆందోళన చెందకుండా ఉండేలా ఆర్‌బీఐ ఈ ‘గుడ్ న్యూస్’ చెప్పింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha