Shivamogga Landslide Accident: కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga) జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది.
అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడి గుడిసెపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారితో సహా ముగ్గురు రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయారు.
Read Also :Karnataka Crime: ఎఫైర్ పెట్టుకుందని భార్యను చంపి భర్త ఆత్మహత్య
అర్ధరాత్రి విరుచుకుపడ్డ మృత్యువు

శివమొగ్గలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు ఆగస్టు 2న (తెల్లవారుజామున 2:30 గంటలకు) ఈ విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా గుడిసెపై కొండచరియలు విరిగిపడటంతో లోపల నిద్రపోతున్న కుటుంబ సభ్యులు మట్టిదిబ్బల కింద చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు విడిచారు.
మృతుల వివరాలు
- మల్లికార్జున్ (35)
- నాగవేణి (28)(మల్లికార్జున్ భార్య)
- సంతోష్ (3)(వీరి మూడేళ్ల కుమారుడు)
మృతులు కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా కొక్కరేగారు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
Shivamogga Landslide Accident: సహాయక చర్యలు & గాయపడిన వ్యక్తి
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో గుడిసెలో నివసిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్లే కొండచరియలు విరిగిపడినట్లు పోలీసులు తెలిపారు.

