Karnataka Crime: కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెసగోడు గ్రామంలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెను దారుణంగా హత్య చేసి..
ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also :IIT Guwahati Student: అసోంలో ఘోరం: జమ్మలమడుగు తహసీల్దార్ కుమార్తె నదిలో పడి దుర్మరణం!
వీడియో కాల్ చేస్తూ ఘాతకం

కెసగోడు గ్రామానికి చెందిన రఘు, గమన దంపతులు స్థానికంగా బేకరీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న రఘు, శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కారులో భార్యను తీసుకెళ్లాడు. కారులోనే భార్య గొంతు నులిమి చంపుతూ, ఆ దృశ్యాలను బంధువులకు వీడియో కాల్ చేసి చూపించాడు. భార్యను హత్య చేస్తున్నట్లు లైవ్‌లోనే స్పష్టం చేశాడు.
Karnataka Crime: రఘు ఆత్మహత్య.. మృతదేహం కోసం గాలింపు
భార్యను చంపిన అనంతరం, రఘు ఊరి చివర ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెట్టుకు వేలాడుతున్న రఘు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారులో హత్య చేసిన భార్య గమన మృతదేహం సంఘటనా స్థలంలో లభ్యం కాకపోవడంతో, రఘు మృతదేహాన్ని ఎక్కడైనా పడేసి ఉంటాడా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హాసన్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

