Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా పడిపోయిన చికెన్ ధరలు

భారీగా పడిపోయిన చికెన్ ధరలు

వార్త 3 weeks ago

Chicken Prices: చికెన్ ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత నెలలో ఆకాశాన్నంటిన చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. శ్రావణ మాసం ప్రభావంతో పాటు డిమాండ్ తగ్గడం వల్ల ఈ ధరల తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

శ్రావణ మాసం ఎఫెక్ట్: భారీగా తగ్గిన చికెన్ ధరలు

గత నెలలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340 నుంచి రూ.350 వరకు పలికింది. కానీ ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల మార్కెట్లో సరఫరా ఎక్కువగా ఉండి, డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా వ్యాపారులు ధరలను భారీగా తగ్గించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల చికెన్ షాపులకు కస్టమర్లు తగ్గి, వ్యాపారం మందగించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత చికెన్ ధరల వివరాలు

మార్కెట్ నివేదికల ప్రకారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • హైదరాబాద్: కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.222, డ్రస్స్‌డ్ చికెన్ రూ.197, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.100, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉంది.
  • ఆంధ్రప్రదేశ్ (విజయవాడ): కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.240, డ్రస్స్‌డ్ చికెన్ రూ.212, ఫారం లైవ్ బర్డ్ రూ.110, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137 వద్ద కొనసాగుతోంది.
  • కరీంనగర్ జోన్: కిలో స్కిన్‌లెస్ రూ.222, డ్రస్స్‌డ్ చికెన్ రూ.197, ఫారం లైవ్ బర్డ్ రూ.100, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉంది.

కోడిగుడ్ల ధరలు స్థిరంగా.. ఇతర నిత్యావసరాల భారం

చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా కొంతవరకు తగ్గాముఖం పట్టాయి. గత నెలలో ఒక్కో గుడ్డు రూ.8 వరకు పలకగా, ప్రస్తుతం ధర తగ్గి డజను గుడ్ల రిటైల్ ధర విజయవాడలో రూ.75గా, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో రూ.74గా ఉంది. అంటే ఒక్కో గుడ్డు ధర సుమారు రూ.6 చొప్పున లభిస్తోంది.

అయితే మాంసం ధరలు తగ్గినప్పటికీ, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధర రూ.60కి చేరుకోగా, కేజీ పంచదార ధర కూడా రూ.60కి చేరింది. ఇలా నిత్యావసర సరుకుల భారం పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

భట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha