Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు.. గూడూరు మార్కెట్‌లో రికార్డు ధరలు

భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు.. గూడూరు మార్కెట్‌లో రికార్డు ధరలు

వార్త 2 months ago

Lemon prices in AP: ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో నిమ్మ ధరలు భారీగా పెరిగిపోయాయి.

ఇక్కడ 50 కేజీల నిమ్మ బస్తా ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొద్ది రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం విశేషం.

High Lemon prices in Gudur Market AP

Lemon prices in AP: పెరిగిన కిలో ధర

గత వారంతో పోలిస్తే నిమ్మకాయల రేట్లు విపరీతంగా పెరిగాయి. కిలో నిమ్మకాయలు క్రితం వారం 130 నుండి 150 రూపాయల మధ్య ఉండగా, ప్రస్తుతం 200 రూపాయల మార్కును చేరుకున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు నిమ్మరసం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగాయి.

దిగుబడి తగ్గిపోవడమే ప్రధాన కారణం

నిమ్మ ధరలు పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్‌కు నిమ్మకాయల రాక తగ్గడమే. ఈ ఏడాది దిగుబడి ఆశించిన స్థాయిలో లేదని వ్యాపారులు చెబుతున్నారు. సప్లై తక్కువగా ఉండటం మరియు వేసవి కాలం కావడంతో వినియోగం ఎక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. సామాన్య ప్రజలు ఈ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ధరల పెంపు.. ఎంత పెరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha