Dailyhunt
సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ధరల పెంపు.. ఎంత పెరిగిందంటే?

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ధరల పెంపు.. ఎంత పెరిగిందంటే?

వార్త 2 weeks ago

Citroen Basalt: ఏప్రిల్ నెల నుంచి వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచే ట్రెండ్‌ను సిట్రోయెన్ ఇండియా కూడా అనుసరించింది. తన పాపులర్ మోడళ్లయిన బసాల్ట్ ఎక్స్, C3 మరియు ఎయిర్‌క్రాస్‌లపై ధరలను అమాంతం పెంచేసింది.

ముఖ్యంగా కూపే స్టైల్ ఎస్‌యూవీ అయిన బసాల్ట్ ధరలు ఇప్పుడు కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయి.

Read Also:Gautam Adani: ముఖేష్ అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు!

Citroen Basalt: ఎంత పెరిగింది? (వేరియంట్ వారీగా)

సిట్రోయెన్ బసాల్ట్ వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల భిన్నంగా ఉంది.

 Citroen Basalt Price Hike April 2026

  • సాధారణ పెరుగుదల: మెజారిటీ వేరియంట్లపై గరిష్టంగా రూ. 40,000 వరకు ధర పెరిగింది.
  • ప్లస్ 1.2 NA పెట్రోల్ MT: ఈ వేరియంట్ ధర సుమారు రూ. 37,000 పెరిగింది.
  • మ్యాక్స్ టర్బో పెట్రోల్ MT (డార్క్ ఎడిషన్): ఊరటనిచ్చే విషయం ఏంటంటే, ఈ ఒక్క మోడల్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

కొత్త ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్)

ఈ పెంపు తర్వాత సిట్రోయెన్ బసాల్ట్ ధరలు ఇప్పుడు రూ. 8.55 లక్షల నుండి రూ. 13.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు ప్రధానంగా మూడు ట్రిమ్స్ (You, Plus, Max) లో లభిస్తుంది.

ఇంజిన్ మరియు ఫీచర్లు:

సిట్రోయెన్ బసాల్ట్ రెండు రకాల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లలో లభిస్తుంది.1.2L టర్బో పెట్రోల్: ఇది 110 PS పవర్, 205 Nm టార్క్‌ను అందిస్తుంది. (6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్), 1.2L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: ఇది 82 PS పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్)

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మెటాలో మళ్ళీ లేఆఫ్స్ బాంబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha