Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య చేతిలో భర్త హత్య.. అసలేం జరిగింది?

భార్య చేతిలో భర్త హత్య.. అసలేం జరిగింది?

వార్త 1 month ago

Kamareddy Crime: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం నాన్‌వెజ్ వండలేదనే చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీయగా, ఇద్దరు పసిపిల్లలను అనాథలుగా మార్చింది.

Read Also:Telangana : MLCలుగా కోదండరాం, అజహరుద్దీన్ నియామకం

చిన్న వివాదం.. పెను విషాదం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ (30), లక్ష్మి దంపతుల మధ్య గత వారం రోజులుగా చిన్నపాటి మనస్పర్థలు నడుస్తున్నాయి. అయితే ఆదివారం రాత్రి జరిగిన గొడవ వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది.ఆదివారం రాత్రి నాన్‌వెజ్ వండాలని శివాజీ తన భార్యను కోరాడు. అందుకు లక్ష్మి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.గొడవ ముదరడంతో ఆవేశం తలకెక్కిన లక్ష్మి, ఇంట్లోనే ఉన్న కొడవలి తీసుకుని శివాజీపై విచక్షణారహితంగా దాడి చేసింది.

 Wife Killed Husband Kamareddy Non Veg Curry Dispute

Kamareddy Crime: అక్కడికక్కడే మృతి

ఈ దాడిలో శివాజీ మెడ, గొంతు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆయన నిమిషాల వ్యవధిలోనే మరణించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ నరహరి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. తండ్రి మృతి, తల్లి జైలు పాలవ్వడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - నిందితుడిపై కేసు నమోదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha