Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - నిందితుడిపై కేసు నమోదు

విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - నిందితుడిపై కేసు నమోదు

వార్త 1 month ago

Assault on RTC Driver Nalgonda Rural: విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై అకారణంగా దాడి చేసి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also:Ponnam Prabhakar in Srisailam: మల్లన్న సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్

 Nalgonda

Assault on RTC Driver Nalgonda Rural: సంఘటన వివరాలు

నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జాలబావి గ్రామ సమీపంలో గల ఐటీ హబ్ (IT Hub) వద్ద ఆదివారం ఉదయం సుమారు 08:10 గంటల సమయంలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు డ్రైవర్ తల్లా రామ్ కుమార్ బస్సును నిర్ణీత స్టాప్ వద్ద నిలిపారు. ఆ సమయంలో తన బైక్‌పై (TS-05-FJ-9301) వచ్చిన తుపాకుల వెంకటేశం అనే వ్యక్తి, బస్సును మధ్యలో ఎందుకు ఆపలేదని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.

​బస్సును కేవలం నిర్దేశించిన స్టాపుల వద్దే ఆపుతామని డ్రైవర్ రామ్ కుమార్ చెప్పినప్పటికీ నిందితుడు వెంకటేశం డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌ను సీటులో నుండి కిందకు లాగి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో డ్రైవర్ రామ్ కుమార్ కుడి కంటి పైన మరియు మోకాలికి గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో బాధితుడు రామ్ కుమార్ ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ SI. సైదా బాబు నిందితుడు తుపాకుల వెంకటేశంపై బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 118(1), 352 కింద కేసు (FIR No. 90/2026) నమోదు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విధినిర్వహణకు ఆటంకం కలిగిస్తూ వారిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ సిబ్బందికి అండగా ఉండి వారి రక్షనే తమధ్యేయ మని నాగిరెడ్డి చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మేడేను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha