Gangojipet Crime: సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఓ భర్త తన భార్య కాళ్లను గొడ్డలితో నరికిన కిరాతక ఘటన చౌటకూర్ మండలం గంగోజిపేట్‌లో చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read also: Indiramma Indlu Scheme: జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. పొంగులేటి
కిరాతకంగా గొడ్డలితో దాడి
పోలీసుల కథనం ప్రకారం.. గంగోజిపేట్‌కు చెందిన కుమ్మరి దుర్గయ్య, వీరామణి (45) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన దుర్గయ్య, ఇంట్లోని గొడ్డలిని తీసుకుని భార్య వీరామణి కాళ్లపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె కాళ్లు తెగిపోయి రక్తమోడటంతో పరిస్థితి విషమంగా మారింది. బాధితురాలిని వెంటనే హైదరాబాద్‌లోని అమీర్‌పేట వెల్నెస్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.

Gangojipet Crime: తండ్రిపై ఫిర్యాదు చేసిన కొడుకు
ఈ దారుణ ఘటన తన కళ్ల ముందే జరగడంతో బాధితురాలి కుమారుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన తల్లిని కిరాతకంగా గాయపరిచిన తండ్రి దుర్గయ్యపై కుమారుడు పుల్కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ దారుణం బయట ప్రపంచానికి తెలిసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడు దుర్గయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

