Co-option Members Election: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా హాజరయ్యారు.
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఓటింగ్ ప్రక్రియలో ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ కేటగిరీలో పున్న లావణ్య, భూక్యా సరోజన ఎన్నికవగా, మైనార్టీ విభాగం నుండి మహమ్మద్ హసన్ లాల్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎంపికయ్యారు. వీరితో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, మరో సభ్యుని ఎన్నిక విషయంలో కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ఒక స్థానాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు.
Read also: Indiramma Indlu Scheme: జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. పొంగులేటి
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
కొత్తగా ఎన్నికైన సభ్యులను అభినందించి సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. నూతన సభ్యులు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని, వార్డుల అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఒక స్థానాన్ని కూడా త్వరలోనే అందరి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చిన తర్వాత భర్తీ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

Co-option Members Election: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దిశానిర్దేశం
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గతంలో మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తయితేనే కొత్తగా మరిన్ని ఇళ్లను కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొత్త సభ్యులు మున్సిపల్ కౌన్సిల్‌తో కలిసి ఒకే గొంతుకగా పని చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మతో పాటు 20 మంది కౌన్సిలర్లు పాల్గొని మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

