Palnadu crime: పల్నాడు జిల్లాలోని తొండపిలో అత్యంత క్రూరమైన సంఘటన చోటుచేసుకుంది. భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, ఒక మహిళను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది.
భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన భర్త లక్ష్మయ్య, గొడ్డలితో ఆమె కాలు నరికిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also:Maharashtra Crime:180 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్!
క్రూరంగా దాడి చేసిన భర్త
స్థానికుల కథనం ప్రకారం.. నిందితుడు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మి ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశం ఆపుకోలేకపోయిన లక్ష్మయ్య, ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె కాలు తెగి వేరుపడింది. తీవ్ర రక్తస్రావంతో భూలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Palnadu crime: సంచిలో కాలుతో స్టేషన్‌కు..
ఈ ఘటనలో లక్ష్మయ్య ప్రవర్తించిన తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. భార్య కాలు నరికిన అనంతరం, తెగిన ఆ కాలును ఒక సంచిలో వేసుకుని నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని భూలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Husband cuts off wife’s leg and carries it in a bag.. Tragedy in Thondapi!
కేసు నమోదు – దర్యాప్తు
ఈ కిరాతక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేదా కేవలం అనుమానంతోనే ఈ దాడికి పాల్పడ్డాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రశాంతంగా ఉండే తొండపి గ్రామంలో ఈ తరహా ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
కోతిని తరిమేందుకు యత్నించి.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడు మృతి!

