Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య, ముగ్గురు కుమార్తెలను కిరాతకంగా హత్య చేసిన భర్త!

భార్య, ముగ్గురు కుమార్తెలను కిరాతకంగా హత్య చేసిన భర్త!

వార్త 3 weeks ago

Jaipur Quadruple Murder: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అత్యంత ఘోరమైన కుటుంబ హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కర్ధాని పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ వాటికాలో రాహుల్ ఝా (45) అనే వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

నలుగురిని దారుణంగా అంతమొందించి, ఏమీ తెలియనట్లు తన తండ్రికి టీ కాచి ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also :Guntur Crime: ఎంత ఘోరం.. ప్రేమకు అడ్డు చెప్పిందని కన్నతల్లిని చంపిన కూతురు!

హత్యల తీరు & పోలీసుల దర్యాప్తు వివరాలు

రాహుల్ ఝా భార్య గీతా ఝా (40), కుమార్తెలు నందిని (22), రాధిక (17), గౌరి (14) వేర్వేరు గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. నిందితుడు రాహుల్, కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో వారి తలలు, ముఖాలపై సిమెంట్ బ్లాక్ లేదా బరువైన రాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలం నుండి రక్తపు మరకలతో ఉన్న సిమెంట్ దిమ్మెను స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన అనంతరం ఉదయం 7 గంటలకు పాలు తెచ్చి తన తండ్రి లక్ష్మీనాథ్ ఝాకు టీ కాచి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రశాంతంగా స్నానం చేసి, షేవ్ చేసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. గదుల్లో రక్తపు మరకలను చూసిన తండ్రి లక్ష్మీనాథ్, పొరుగువారి సహాయంతో ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jaipur Quadruple Murder: ఆర్థిక ఇబ్బందులే కారణమా?

నిందితుడు రాహుల్ షేర్ ట్రేడింగ్ చేసేవాడని, ఇటీవల గుజరాత్ నుంచి జైపూర్ వచ్చాడని తేలింది. ఆయన భార్య గీత బ్యూటీ పార్లర్ నడిపేది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ ఇటీవల పక్కింటి వ్యక్తి వద్ద రూ. 25,000 అప్పు కూడా తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు తనను ట్రాక్ చేయకుండా ఉండేందుకు రాహుల్ తన మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి ఇంట్లోనే వదిలివెళ్లాడు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

చోరీ కేసులో పురోగతి: ఆయుధాలు స్వాధీనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha