Secunderabad Madras Regiment: సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన సంచలనాత్మక ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు సంస్థలు కీలక పురోగతి సాధించాయి.
చోరీకి గురైన ఆయుధాలను (మ్యాగజైన్‌లు, బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక అధికారితో పాటు మరొక ఇద్దరిని అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.
Read Also :Secunderabad Madras Regiment: ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్

మహబూబ్‌నగర్‌లో ఆయుధాల స్వాధీనం
మహబూబ్‌నగర్‌లోని ఓ విశ్రాంత (రిటైర్డ్) ఆర్మీ అధికారి ఇంట్లో దాచి ఉంచిన ఆయుధాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆర్మీ క్యాంప్‌లోని 'బెల్ ఆఫ్ ఆర్మ్స్' ఇన్‌ఛార్జ్, వెపన్స్/బుల్లెట్లు జారీ చేసే 'ఆమ్నిషన్ సెక్షన్' ఇన్‌ఛార్జ్‌ల ప్రత్యక్ష సహకారంతోనే ఈ రిటైర్డ్ అధికారి ఈ భారీ చోరీకి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.
Secunderabad Madras Regiment: కేసు నేపథ్యం & దర్యాప్తు సంస్థలు
ఆగస్టు 30 సాయంత్రం నుంచి 31 ఉదయం మధ్య కాలంలో మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిటీర్కార్ ఇచ్చిన ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్‌తో పాటు 1,912 రౌండ్ల బుల్లెట్లు చోరీకి గురయ్యాయి. బొల్లారం, మల్కాజిగిరి పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా రౌండ్ ది క్లాక్ విచారణ జరిపి 10 రోజుల్లోనే ఆయుధాలను రికవరీ చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి త్వరలోనే విలేకరుల సమావేశం (Press Meet) నిర్వహించి ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 87 మంది గల్లంతు

