Dailyhunt
భార్య తల నరికి, చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగిన భర్త!

భార్య తల నరికి, చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగిన భర్త!

వార్త 1 week ago

Chhattisgarh Crime: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మానవత్వం మంటగలిసేలా ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కన్నతల్లి లాంటి భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు.

అంతటితో ఆగక, ఆమె తెగిపడిన తలను చేత్తో పట్టుకుని గ్రామంలో వీధి వీధి తిరుగుతూ భయాందోళన సృష్టించాడు.

Read Also:Bengal Election Violence: ముర్షిదాబాద్‌లో బాంబుల మోత.. హుమాయున్ కబీర్ వాహనంపై దాడి!

Chhattisgarh Crime: అనుమానమే పెనుభూతమై..

పోలీసుల కథనం ప్రకారం.. కోర్బా జిల్లాకు చెందిన సాలిక్ రామ్ యాదవ్ (58) అనే వ్యక్తికి తన భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. తన ప్రవర్తనపై భార్య నిత్యం అనుమానం వ్యక్తం చేస్తోందని సాలిక్ రామ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిన్న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను, భార్యతో గొడవకు దిగాడు. కోపం కట్టలు తెంచుకోవడంతో పదునైన ఆయుధంతో ఆమె తలను నరికి చంపాడు.

గ్రామంలో వీరంగం.. పోలీసులకు లొంగుబాటు

హత్య చేసిన అనంతరం, నిందితుడు ఆమె తలను చేత్తో పట్టుకుని గ్రామంలో అందరూ చూస్తుండగానే తిరిగాడు. ఈ భీభత్సాన్ని చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్య ప్రవర్తన నచ్చకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.

నిందితుడి అరెస్ట్

పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

బెంగళూరు ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఘోరం.. బిడ్డను చంపి బ్యాగులో కుక్కిన యువతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha