Bengal Election Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ ( TMC) కార్యకర్తలకు, ఆ పార్టీ మాజీ నేత హుమాయున్ కబీర్‌కు మధ్య జరిగిన ఘర్షణలు, ఓటర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో పోలింగ్ కేంద్రాల వద్ద భయానక వాతావరణం నెలకొంది.
Read Also:Assembly elections: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మోడీ, ఖర్గే పిలుపు
హుమాయున్ కబీర్‌కు చుక్కెదురు
ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AUJP) వ్యవస్థాపకుడు, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ నౌడా నియోజకవర్గంలోని శిబ్‌నగర్ పోలింగ్ బూత్‌ను సందర్శించినప్పుడు టీఎంసీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. “గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. కబీర్‌ను “బీజేపీ ఏజెంట్” అని ముద్రవేస్తూ నిరసనకారులు ఆందోళన చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్‌లో టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన కబీర్, ప్రస్తుతం సొంత పార్టీతో బరిలో ఉన్నారు.
Bomb blast in Murshidabad.. Attack on Humayun Kabir’s vehicle!
Bengal Election Violence: నాటు బాంబుల దాడి.. మహిళకు గాయాలు
నౌడాలోని శివనగర్ ప్రాథమిక పాఠశాల సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడగా, బాధితులు దీనికి కబీర్ పార్టీయే కారణమని ఆరోపిస్తున్నారు. అయితే, టీఎంసీ ఎంపీ అబు తాహెర్ ఖాన్ ఈ దాడుల వెనుక కబీర్ హస్తం ఉందని విమర్శించగా, కబీర్ మాత్రం తాను శాంతిని కోరుకుంటున్నానని, తన కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిపారు.
ఓటర్ల బెదిరింపు.. రంగంలోకి ఎన్నికల సంఘం
డోమ్‌కల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయ్‌పూర్ గ్రామంలో తెల్లవారుజాము నుంచే సాయుధ వ్యక్తులు తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. పలువురిని ఓటు వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం (EC) తీవ్రంగా స్పందించింది. ఈ పరిణామాలపై తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. పోలీసులు అక్కడక్కడా గుంపులను చెదరగొట్టడానికి స్వల్ప లాఠీచార్జి చేశారు.
హోరాహోరీ పోరు
వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తుండగా, ఈసారి ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మొదటి దశలోనే ఇంతటి ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో మిగిలిన దశల పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

