Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య వియోగం తట్టుకోలేక కుమారుడితో కలిసి చెరువులో దూకిన తండ్రి

భార్య వియోగం తట్టుకోలేక కుమారుడితో కలిసి చెరువులో దూకిన తండ్రి

వార్త 3 months ago

Janagama district Crime: కుటుంబానికి అన్నీ తానై నడిపించిన భార్య అకాల మరణం ఆ ఇంటి పెద్దను కోలుకోలేని దెబ్బతీసింది. ఆమె లేని జీవితాన్ని, మానసిక పరిపక్వత లేని తన యువ కుమారుడి భవిష్యత్తును ఊహించుకుని నెల రోజులుగా నరకయాతన అనుభవించిన ఆ తండ్రి..

చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కొడుకును ఈ లోకంలో ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక, అతనితో కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని బండ్లగూడెంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also: Postpartum Mother Deaths Medak:నెల రోజుల బాలింతలైన వదిన, మరదలు వరుస మృతి!

 Janagama district Crime:

బండగుట్ట ఆలయ కోనేరులో విషాదాంతం

పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన లక్ష్మీనర్సింహాచార్యులు (50) తన భార్య శ్రీదేవి, కుమారుడు పవన్‌కుమారాచార్యులు (25)తో కలిసి 30 ఏళ్ల క్రితమే లింగాలఘనపురానికి వలస వచ్చారు. సమీపంలోని బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నర్సింహాచార్యులు అర్చకుడిగా సేవలు అందిస్తున్నారు. గ్రామస్థుల ఆర్థిక సాయంతో ఈ మధ్యనే వారు ఒక ఇల్లు కూడా నిర్మించుకున్నారు.

Janagama district Crime: ఒకే నెలలో మూడు మరణాలు

గత నెల ఏప్రిల్ 16వ తేదీన లక్ష్మీనర్సింహాచార్యులు భార్య శ్రీదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి తండ్రీకొడుకులు తీవ్ర మనస్తాపానికి, ఒంటరితనానికి గురయ్యారు. గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని కోనేరు (చెరువు)లో తండ్రీకొడుకులిద్దరూ దూకేశారు. శుక్రవారం ఉదయం మృతదేహాలు కోనేరులో తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డిసిపి రాజమహేంద్రనాయక్, సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై శ్రవణ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఒకే ఇంట్లో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామం మూగబోయింది. భార్య మరణంతో పాటు తోడైన ఆర్థిక సమస్యల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ బలవన్మరణాల వెనుక మరేదైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha