Eshwar Sai Folk Dancer: తెలంగాణ జానపద పాటలతో నెట్టింట విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్, గాయకుడు ఈశ్వర్ సాయి (Eshwar Sai) వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
వేములవాడలోని ఓ భవనంలో మరో మహిళా ఆర్టిస్ట్‌తో ఉన్న సమయంలో ఆయన భార్య అక్కడికి చేరుకుని రచ్చ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also :Jr NTR: పెంపుడు నేస్తం 'బఘీరా' మృతి.. ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్

ఘటన ఎక్కడ జరిగింది? భార్య ఆరోపణలేంటి?
ఈ వివాదాస్పద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈశ్వర్ సాయి మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ఉన్నారనే సమాచారంతో ఆయన భార్య అక్కడికి చేరుకున్నారు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే గదిలో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా నిర్ధారించలేమని, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
Eshwar Sai Folk Dancer :’బాసింగ బలాలు’ పాటతో పాపులర్ అయిన ఈశ్వర్ సాయి
ఈశ్వర్ సాయి ఇటీవల విడుదలైన ‘బాసింగ బలాలు’ (Basinga Balalu) అనే జానపద పాటతో విపరీతంగా పాపులర్ అయ్యారు. ఈ పాటలో ఈశ్వర్ సాయితో పాటు వైష్ణవి సోనీ నటించగా, యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి పెళ్లిళ్లు, డీజే ఈవెంట్లలో మారుమోగిపోయింది. అంతేకాకుండా, ఈశ్వర్ సాయి గతంలో మాధురి రాథోడ్ అనే ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పలు హిట్ జానపద గీతాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా వరుస హిట్ పాటలతో దూసుకుపోతున్న సమయంలో ఈశ్వర్ సాయి కుటుంబ వివాదంతో వార్తల్లో నిలవడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

