Kannauj Wife Murder: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనలో సోనమ్ అనే మహిళ సజీవదహనమై ప్రాణాలు కోల్పోయింది. జగత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also :Kothapatnam Boat Accident: ఏపీ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం.. బోటులో 4 మృతదేహాలు లభ్యం!
Kannauj Wife Murder: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య

వివరాల్లోకి వెళ్తే.. సుఖ్‌వీర్ సింగ్ అలియాస్ మోను తన భార్య సోనమ్‌పై అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. ఈ విషయమై దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోనమ్‌ను కుర్చీకి కట్టేసి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా మంటలు వ్యాపించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అనంతరం సుఖ్‌వీర్ సింగ్ తన పిల్లలను వెంట తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి ఆచూకీపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

