Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం నాటికి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Danger Warning) జారీ చేశారు.
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో వరద ప్రవాహం నిరంతరం వస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Read Also : Telangana Rains: నేడు రేపు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్
Godavari surging at Bhadrachalam; danger warning issued.
Bhadrachalam Godavari: కల్యాణ కట్ట వరకు చేరిన వరద నీరు
వరద ఉధృతికి భద్రాచలంలోని స్నాన ఘాట్ ప్రాంతంలో ఉన్న పలు మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగిపోయాయి. అంతేకాకుండా కల్యాణ కట్ట వరకు వరద నీరు వచ్చి చేరడంతో స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి దిగువన ఉన్న శబరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి పోటు (ఎదురు తన్నుతుండటం) వల్ల భద్రాచలం నుంచి దిగువకు వెళ్లే నీటి ప్రవాహం నెమ్మదించి, ఇక్కడ నీటిమట్టం వేగంగా పెరగడానికి కారణమవుతోంది.
పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకున్న వెంటనే ‘మొదటి ప్రమాద హెచ్చరిక’ జారీ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

