Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపానికి 40 ఏళ్లు

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపానికి 40 ఏళ్లు

వార్త 1 week ago

Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి నది వినాశకర రూపాన్ని దాల్చి నేటికి సరిగ్గా 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1986 ఆగస్టు 16న సంభవించిన ఆ మహా వరద భద్రాచలం చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుగా నిలిచిపోయింది.

ఆ సమయంలో గోదావరి నీటిమట్టం ఏకంగా 75.6 అడుగులకు చేరుకుని చారిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. నది చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నీటిమట్టం ఇదే కావడం గమనార్హం. ఆ వరద ఉద్ధృతికి సుమారు 32 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహించడంతో భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అతలాకుతలమైన ఏజెన్సీ గ్రామాలు: తీరని ఆస్తి, ప్రాణ నష్టం

ఈ మహా వరదల దాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు తీవ్రంగా అతలాకుతలమయ్యాయి. వందలాది గ్రామాలు నీటమునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా, వేలాది మంది ప్రజలు ఇళ్లు వాకిళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలు అందించడం సైతం అత్యంత సవాలుగా మారింది. 40 ఏళ్లు గడిచినా 1986 నాటి ఆ గోదావరి ప్రళయ జ్ఞాపకాలు, ఎదుర్కొన్న భయానక అనుభవాలు ఇప్పటికీ మన్య ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసే ఉన్నాయి.

హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైల్.. 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha