Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభవం

భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభవం

వార్త 3 months ago

అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవం

Bhadrachalam Sita Rama Kalyanam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.

మిథిలా స్టేడియంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివచ్చారు.

Read Also:Revanth Reddy: నేడు శ్రీ సీతారాముల కళ్యాణలో పాల్గొననున్న సీఎం రేవంత్ దంపతులు

 The splendor of Sita Rama’s wedding in Bhadrachalam

Bhadrachalam Sita Rama Kalyanam: ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు భద్రాచలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు సమర్పించారు. అనంతరం వారు కళ్యాణోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

శ్రీరామ నవమి విశిష్టత: ఒకే తిథి.. మూడు అద్భుత ఘట్టాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha