Bhadradri Kothagudem: సాధారణంగా మనుషులను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడానికి 'హనీ ట్రాప్' చేయడం చూస్తుంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జేత్యాతండాలో దుండగులు ఏకంగా కోడిపుంజును ఎత్తుకెళ్లడానికి వినూత్నంగా ప్లాన్ చేశారు .రైతు లకావత్ జేత్‌రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు.
ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం ఆయన పొలానికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఒక పుంజు కనిపించలేదు.
Operation Kagar: మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్‌జీ లొంగింపు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఇరుగుపొరుగు వారిని ఆరా తీయగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు కోడి పెట్టను తీసుకుని వచ్చినట్లు తేలింది. ఆ వ్యక్తులే పెట్టను ఎరగా వేయగా.. జేత్రమ్ ఇంట్లోని కోడి పుంజు దగ్గరకు రావడంతో దాన్ని పట్టుకుని బైక్ పై పారిపోయినట్లు గుర్తించాడు. దీనిపై జేత్రమ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
National Medical Commission: TG, APలకు సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంపు

