Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ కేసులో విచారణకు సహకరించండి: మంత్రి పొన్నం

భగీరథ్ కేసులో విచారణకు సహకరించండి: మంత్రి పొన్నం

వార్త 1 week ago

Bandi Bhagirath POCSO Case: తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also:Mogudampally Tanker Accident:మాడ్గి వద్ద కెమికల్ ట్యాంకర్ దగ్ధం!

బండి భగీరథ్ కేసులో సానుభూతి వద్దు.. నిజాయితీ నిరూపించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్!

తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

 Ponnam Prabhakar vs Bandi Sanjay

ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా, తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో బండి సంజయ్ ఆదర్శంగా నిలవాలని పొన్నం సూచించారు.తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించి సానుభూతి పొందాలని చూడటం కంటే, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బండి సంజయ్ కోరాల్సి ఉందని హితవు పలికారు.ఆరోపణలు చేస్తున్న అమ్మాయి మిమ్మల్ని కలిసిందా? ఆమెతో మీ కుమారుడికి సంబంధం ఉందా, లేదా? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని నిలదీశారు.

Bandi Bhagirath POCSO Case: తెలంగాణ ఆడబిడ్డల రక్షణే మా బాధ్యత

ఈ కేసు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పొన్నం ప్రభాకర్ వివరించారు.”తెలంగాణ ఆడబిడ్డలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది,” అని ఆయన వెల్లడించారు.

సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డీజీపీతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించారని పొన్నం గుర్తు చేశారు.నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఒక మహిళా డీసీపీ స్థాయి అధికారికి ఈ కేసు బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.ఇతరులపై రాజకీయ ఆరోపణలు చేసే ముందు, చట్టానికి సహకరించి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చట్టం తన పని తాను చేసుకుపోయేలా వదిలిపెట్టి వ్యవస్థపై గౌరవాన్ని చాటుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha